మళ్ళీ అక్కీ అండ్ జాన్ కాంబో?

అక్షయ్‌తో కలిసి పని చేయడం అంటే నాకు సెలవులకు వెళ్లినట్లే.. అని జాన్ అబ్రహం చెప్పాడు.;

By :  K R K
Update: 2025-03-21 05:43 GMT

అక్షయ్ కుమార్, జాన్ అబ్రహామ్ కాంబినేషన్‌లో వచ్చిన "గరం మసాలా", "దేశీ బాయ్స్" వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. వీరిద్దరూ మళ్లీ కలసి ఓ కామెడీ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహామ్ అక్షయ్‌తో తన బంధం గురించి, భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి నటించే అవకాశంపై స్పందించాడు.

ఈ ఇంటర్వ్యూలో "గరం మసాలా", "దేశీ బాయ్స్" సినిమాలపై విపరీతంగా వైరల్ అవుతున్న మీమ్స్ గురించి చెప్పగా.. దీనిపై స్పందించిన జాన్, "అక్షయ్‌, నేను. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరే ఇద్దరు నటుల మధ్యన ఉంటుందని నేను అనుకోను" అని పేర్కొన్నాడు.

మీరు మళ్లీ ఓ కామెడీ సినిమాలో కలిసి నటించే ఆలోచన చేశారా?" అని ప్రశ్నించగా.. "నేను అక్షయ్‌ను అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాను. అలాగే ‘దేశీ బాయ్స్’ దర్శకుడు రోహిత్ ధావన్‌తో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటాను. అతనితో నాకు స్నేహం మాత్రమే కాదు, అతను నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. ‘దేశీ బాయ్స్, దిశూమ్’ చిత్రాలను కలిసి చేశాం. అతనితో తరచుగా మాట్లాడుతూనే ఉంటాను....’’ అని జాన్ అబ్రహం చెప్పాడు.

ఇంకా.. మాట్లాడుతూ, "గరం మసాలా 2 అయినా, దేశీ బాయ్స్ 2 అయినా... ఇవి రావడం మా ఇద్దరికీ చాలా సంతోషంగా ఉంటుంది. వీటిలో ఏదైనా సినిమా చేసే అవకాశం వస్తే, నేను ఆనందంగా ఒప్పుకుంటాను. అక్షయ్‌తో కలిసి పని చేయడం అంటే నాకు సెలవులకు వెళ్లినట్లే. అతను నిజంగా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి మళ్లీ పని చేస్తే, ప్రేక్షకులకూ మాకూ చాలా సరదాగా ఉంటుంది" అని చెప్పాడు.

Tags:    

Similar News