75వ రెయిడ్ కు రెడీ అవుతోన్న అజయ్ దేవ్ గణ్

రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ‘రెయిడ్ 2’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసారి ప్రతినాయకుడిగా సౌరభ్ శుక్లా స్థానాన్ని యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఆక్రమించాడు.;

By :  K R K
Update: 2025-03-28 09:32 GMT

బాలీవుడ్‌లో ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన ఓ విభిన్నమైన కథను మనం ఇప్పటికీ మరిచిపోలేదు. అది ఆదాయపు పన్ను అధికారి అమేయ్ పట్నాయక్ కథ. ఆ చిత్రంలో లాజిక్ లోపాలున్నా... వాటిని మరిచిపోయేంతగా కథ ఆసక్తికరంగా ఉంటుంది. కథ నడిపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా పేరు ‘రెయిడ్’. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.

రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ‘రెయిడ్ 2’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసారి ప్రతినాయకుడిగా సౌరభ్ శుక్లా స్థానాన్ని యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఆక్రమించాడు. ఒకే ఒక్క డైలాగ్‌తో అతను తన అహంకారంతో ఆకట్టుకుంటాడు. టీజర్‌లో నిజమైన ఆకర్షణ రితేష్ దేశ్‌ముఖ్‌ అనే చెప్పాలి. "నేను ఒక మహాభారతం!" అనే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా కనిపిస్తోంది.

ఇంతకు ముందు ‘సింఘం అగైన్’ మూవీతో రామాయణాన్ని తెరపై చూపించిన అజయ్.. అప్పుడు మహాభారతం కాన్సెప్ట్ ను రెయిడ్ కోసం వాడుకున్నట్టు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ టీజర్‌లో ఏకైక బలమైన అంశం రితేష్ దేశ్‌ముఖ్ విలన్ అవతారమే. అలాగే, సౌరభ్ శుక్లా కూడా కాసేపు కనిపించి ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించాడు. అయితే, ఆయన పాత్ర సినిమాలో కీలకమైనదా, లేక కేవలం టీజర్‌కి ఉపయోగించిందా అన్నది తెలియాలి.

కథాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అమే పట్నాయక్ తన 75వ రెయిడ్ ను ప్రారంభించనున్నాడు. రితీష్ దేశ్ ముఖ్ ఒక శక్తిమంతమైన రాజకీయ నేతగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఆశిద్దాం. అలాగే, ఈ సినిమాలో అజయ్ భార్యగా ఇలియానా స్థానంలో వాణీ కపూర్ వచ్చిచేరింది. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించి ఉంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News