‘ఢమాల్ 4’ ముంబై షెడ్యూల్ మొదలైంది!

“ద మాడ్‌నెస్ ఈజ్ బ్యాక్.. ‘ఢమాల్ 4’ స్టార్ట్ అయింది. మల్షేజ్ ఘాట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ముంబయి షెడ్యూల్ మొదలైంది... నవ్వుల పండుగ మొదలయ్యింది...” అంటూ తెలిపాడు.;

By :  K R K
Update: 2025-04-11 01:33 GMT

బాలీవుడ్ యాక్షన్ డైనమైట్.. అజయ్ దేవగన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మే 1న విడుదల కాబోతున్న ‘రైడ్ 2’ సినిమా కోసం ఫ్యాన్స్ .. ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... అజయ్ ఆల్రెడీ.. తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్ ‘ధమాల్ 4’ షూటింగ్‌లోకి ఎంటరయిపోయాడు కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బీహైండ్ ద సీన్స్ ఫోటోలు షేర్ చేస్తూ అజయ్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు.

“ద మాడ్‌నెస్ ఈజ్ బ్యాక్.. ‘ఢమాల్ 4’ స్టార్ట్ అయింది. మల్షేజ్ ఘాట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ముంబయి షెడ్యూల్ మొదలైంది... నవ్వుల పండుగ మొదలయ్యింది...” అంటూ తెలిపాడు. ఈ పోస్టుపై అభిమానులు భారీగా స్పందిస్తూ.. సినిమాలోని మళ్లీ అదే పాత హాస్య గోల చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్స్‌తో నింపేశారు.

ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. గత మూడు ‘ఢమాల్’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన చేతిలోనే రూపొందుతోంది. టీ-సిరీస్, దేవగన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫరీ వంటి నటి నటులు నటిస్తున్నారు.

2007లో మొదటి భాగం విడుదలైన ‘ఢమాల్’ సిరీస్ తర్వాత, 2011లో ‘డబుల్ ధమాల్’, 2019లో ‘టోటల్ ఢమాల్’ అనే సీక్వల్స్ వచ్చాయి. ప్రతి సినిమా ప్రేక్షకులను కొత్త రకంగా నవ్వించే ప్రయత్నం చేసింది. మూడో భాగంలో అడవిలో సాగే కథకు భిన్నంగా.. నాలుగో భాగంలో పూర్తి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈసారి కథకు తగినట్టుగా సెట్టింగులు, విజువల్స్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాక, ‘టోటల్ ఢమాల్‌’ లో కనిపించిన అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ కూడా తమ పాత్రల్లో మళ్లీ కనిపించే అవకాశం ఉందని టాక్. కథ ఇప్పటికే ఫిక్స్ అయ్యిందనీ, ఇప్పుడు లుక్, ఫీల్ పనుల మీద దృష్టి పెట్టారట. సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ, 2025 చివర్లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది.

Tags:    

Similar News