‘సికందర్’ కోసం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు !
ఈ సినిమా కోసం విమానం, రైలు, జైలు, ఆసుపత్రిలో నాలుగు ప్రధాన యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేశారని సమాచారం.;
సల్మాన్ ఖాన్ అంటే యాక్షన్.. యాక్షన్ అంటే సల్మాన్ ఖాన్. తమిళ క్రేజీ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్ లో ప్రస్తుతం ఆయన ‘సికందర్’ అనే మూవీ లో నటిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అసలు మేటరుకొస్తే .. ఈ సినిమా కోసం విమానం, రైలు, జైలు, ఆసుపత్రిలో నాలుగు ప్రధాన యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేశారని సమాచారం.
సల్మాన్ ఖాన్ పై గత నెలలో ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఒక ట్రైన్ సన్నివేశాన్ని షూట్ చేశారు. ఒక భాగం స్టూడియోలో చిత్రీకరించిన తర్వాత.. యూనిట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఈ సినిమాలోని ఈ సన్నివేశం ఏంటంటే.. సల్మాన్ అతడి బాడీ గార్డ్స్ తో కలిసి ఎవరో ఒకరిని వెతకడానికి ప్రయత్నిస్తారు. ఈ సన్నివేశంలో సల్మాన్ తన అసలైన బాడీ గార్డ్స్ ను కూడా పక్కన పెట్టుకున్నారు, ఎందుకంటే ఇది భారీ జనసమూహంలో జరిగే సన్నివేశం. ఈ సన్నివేశం చివర్లో.. సల్మాన్ నిందితుడిని పట్టుకొని అతణ్ని ట్రైన్ లో ఒక యాక్షన్ సీక్వె్న్స్ తో ఎదుర్కొంటాడు.
2025 ఈద్ కానుకగా.. రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలోని ఈ యాక్షన్ సీక్వెన్స్, జైలు సీన్ హైలైట్ కాబోతున్నాయి. జైలు సీన్ అయితే.. సల్మాన్ గ్యాంగ్‌స్టర్లను సూటిగా ఎదుర్కొంటాడు. ఈ సన్నివేశం ఫిలిం సిటీలోనే కాకుండా, మటుంగాలో కూడా షూట్ చేశారు. ఇక సికందర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో సల్మాన్ ధనవంతుడి పాత్రలో కనిపిస్తాడు, పేదల బాధలు చూసి సామాన్యుడిగా జీవించాలని నిర్ణయించుకుంటాడు. ఈనెలాఖర్లో చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఆ తర్వాత సల్మాన్ మార్చి మొదటి వారం నుంచి ప్రమోషన్లు మొదలు పెడతాడని సమాచారం.