తొలిసారి విలన్ గా అభిషేక్ బచ్చన్ !

Update: 2025-03-14 07:08 GMT

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కింగ్’ మూవీకి సంబంధించి విశేషాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమా ద్వారా షారుఖ్ కూతురు సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేయనుంది. అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని విషయాలను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తుండడం విశేషం. అయితే ఈ పాత్రకు లీన్ బాడీ కావాల్సిన అవసరం ఉన్నందున.. సిద్ధార్థ్ ఆనంద్ ప్రత్యేకంగా మెనేసింగ్ లుక్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకోసం అభిషేక్ ఇప్పటికే జిమ్‌లో వర్కౌట్స్ మొదలుపెట్టారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, 'కింగ్'లో అభిషేక్ బచ్చన్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయడానికి సిద్ధార్థ్ ఆనంద్ కసరత్తు చేస్తున్నారు. ఈ పాత్ర కోసం అభిషేక్ ప్రత్యేకమైన శరీర ఆకృతి, స్టైల్ ను డెవలప్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్-ప్యాక్‌డ్ ఎంటర్టైనర్ కావడంతో, అతని క్యారెక్టర్ దానికి తగ్గట్లుగా డిజైన్ చేస్తున్నారు.

అభిషేక్ బచ్చన్ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు కానీ, పూర్తి నెగటివ్ షేడ్‌లో విలన్ గా ఇంత భారీ స్థాయిలో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అభిషేక్ బచ్చన్ లీన్ బాడీతో కనిపించే విధానం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ రెండు అల్ఫా పర్సనాలిటీలు ఎదురెదురుగా తలపడేలా ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో షారుఖ్ ఖాన్ కూడా ప్రత్యేక శరీర ఆకృతిని సంపాదించేందుకు జిమ్‌లో కఠిన సాధనలు చేస్తున్నారు.

Tags:    

Similar News