‘ఆమిర్ ఖాన్ టాకీస్’ లోకి రాబోతున్న ‘సితారే జమీన్ పర్’

ఆగస్టు 1 నుంచి ఆమిర్ యూట్యూబ్ ఛానెల్ ‘ఆమిర్ ఖాన్ టాకీస్’ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశాడు.;

By :  K R K
Update: 2025-07-30 02:07 GMT

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వరుస ఫ్లాప్‌ల తర్వాత, ఫీల్-గుడ్ స్పోర్ట్స్ కామెడీ-డ్రామా ‘సితారే జమీన్ పర్’తో బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆర్‌ఎస్ ప్రసన్న డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియాలో రూ. 160 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇది రిలీజ్‌కు ముందు అసాధ్యంగా అనిపించింది. గ్లోబల్‌గా ఈ మూవీ దాదాపు రూ. 260 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పోస్ట్-పాండమిక్‌లో ఫీల్-గుడ్ సినిమాలకు ఆదరణ తగ్గినా, ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం అంచనాలను మించి ఆకట్టుకుంది.

తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. ‘సితారే జమీన్ పర్’ ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల కాదని, బదులుగా ఆగస్టు 1 నుంచి ఆమిర్ యూట్యూబ్ ఛానెల్ ‘ఆమిర్ ఖాన్ టాకీస్’ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే, సినిమా చూడాలంటే రూ. 100 చెల్లించాలి. థియేట్రికల్ విండో ఆరు వారాలు. ఈ సినిమా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉంటుంది. అక్కడి మార్కెట్‌లకు తగ్గట్టు ధర నిర్ణయించారు.

యూట్యూబ్‌లో సరసమైన ధరతో సినిమాను విడుదల చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుందని ఆమిర్ గట్టిగా నమ్ముతున్నాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పిలవబడే ఆమిర్ నుంచి ఇది నిజంగా సాహసోపేతమైన, అసాధారణ నిర్ణయం. పే-పర్-వ్యూ విధానానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ‘సితారే జమీన్ పర్’ ఆమిర్ ఖాన్ యొక్క గుర్తుండిపోయే చిత్రం ‘తారే జమీన్ పర్’కు స్పిరిచువల్ సీక్వెల్. ఈ సినిమాలో జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటించింది.

Tags:    

Similar News