విజయ్ దేవరకొండకి బర్త్ డే విషెస్!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా వారసత్వం లేని నటులకు అది మరింత కష్టం. అలాంటి కష్టాలను అధిగమించి చిత్ర పరిశ్రమలో ఇప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.;
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా వారసత్వం లేని నటులకు అది మరింత కష్టం. అలాంటి కష్టాలను అధిగమించి చిత్ర పరిశ్రమలో ఇప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.
తొలుత 'నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిశాడు. విజయ్ ను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించుకునేలా చేసిన చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ సినిమాలో హీరో నాని. విజయ్ దేవరకొండ కి సెకండ్ హీరో రోల్ దక్కింది. ఈ మూవీలో విజయ్ యాక్టింగ్ చూసిన వారంతా.. ఈ అబ్బాయి ఎవరు? అనే ఆరాలు మొదలుపెట్టారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంలోని రిషి పాత్ర విజయ్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.
ఇక విజయ్ ను హీరోగా నిలబెట్టిన చిత్రం 'పెళ్లి చూపులు'. తన మిత్రుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ పోషించిన ప్రశాంత్ పాత్రలో.. ప్రతీ యువకుడు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాకి రెండు జాతీయ పురస్కారాలు కూడా దక్కాయి. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి' సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' వంద కోట్ల చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత 'మహానటి'లో అతిథి పాత్రలో మెరిసి అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. మధ్యలో 'నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్' వంటి ఫ్లాప్స్ వచ్చినా.. 'టాక్సీవాలా, ఖుషి, ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలతో కూల్ హిట్స్ అందుకున్నాడు.
ప్రస్తుతం 'కింగ్డమ్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 30న విడుదలకు ముస్తాబవుతుంది. ఈరోజు (మే 9) విజయ్ బర్త్ డే స్పెషల్ గా 'కింగ్డమ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్‌లో విజయ్ చాలా రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
'కింగ్డమ్' తర్వాత దిల్‌రాజు బ్యానర్ లో 'రౌడీ జనార్థన్', మైత్రీ మూవీ మేకర్స్ లో రాహుల్ సంకృత్యాన్ సినిమాల్లో నటించనున్నాడు విజయ్. మొత్తంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.