టోక్యో నగర వీధుల్లో అందాల మీనూ!
మీనాక్షి తన ట్రావెల్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, జపాన్‌లోని అందమైన లొకేషన్స్‌లో స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తోంది.;
టాలీవుడ్ అందాల హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం జపాన్‌లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఆమె.. తన బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకొని జపాన్‌ను అన్వేషించడానికి, రిలాక్స్ అవ్వడానికి బయల్దేరింది. మీనాక్షి తన ట్రావెల్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, జపాన్‌లోని అందమైన లొకేషన్స్‌లో స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తోంది.
జపనీస్ యానిమే పట్ల తనకున్న ఇష్టాన్ని కూడా ఆమె బయటపెట్టింది. టోక్యోలోని సుగా ష్రైన్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఒటోకోజాక స్టెయిర్‌కేస్ వద్ద ఫోటోలు తీసుకుంది. ఇది యానిమే ఫ్యాన్స్‌కు ఐకానిక్ స్పాట్. ఎక్కడైతే వారు పాపులర్ సీన్స్‌ను రీక్రియేట్ చేస్తారో అక్కడే అమ్మడు మంచి మంచి పోజులిచ్చింది. ఆమె ఫ్యాన్స్ ఆమె పోస్ట్‌లతో సంతోషంగా ఉన్నారు.
ఒక రోజు ఆమె టోక్యోలోని ఐకానిక్ క్రాస్‌వాక్స్ దాటుతూ కనిపించగా, మరో రోజు జపనీస్ స్టూడెంట్ స్టైల్‌లో షార్ట్ స్కర్ట్, షర్ట్‌లో ఫోటోలు దిగింది. తాజాగా ఆమె ఎరుపు రంగు ఔట్‌ఫిట్‌లో ఫోటోలు షేర్ చేస్తూ, "నాలోని పిల్లలాంటి మనసు ట్రైన్స్, రామెన్, ఐస్‌క్రీమ్, విండ్ డోస్‌తో సంతోషంగా ఉంది" అని రాసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. మీనాక్షి చౌదరి తదుపరి ‘యన్సీ 24’, "అనగనగా ఒక రాజు" సినిమాల్లో కనిపించనుంది.