అల్లు-అట్లీ మూవీలో మక్కళ్ సెల్వన్?

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉందట. కానీ, మేకర్స్ నుంచి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.;

By :  K R K
Update: 2025-08-20 13:39 GMT

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సై-ఫై మూవీ గురించి సోషల్ మీడియాలో హైప్ ఆకాశాన్ని తాకేస్తోంది. ఇప్పటిదాకా అల్లు అర్జున్, దీపికా పదుకొణె మాత్రమే కన్ఫామ్ అయిన స్టార్ కేస్ట్. కానీ మిగతా కాస్టింగ్ గురించి గాసిప్స్ ఫుల్ జోష్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మృణాళ్ ఠాకూర్, రష్మికా మందన్నా ఈ సినిమాలో ఉంటారని బజ్ షికారు చేస్తోంది. అలాగే రమ్యకృష్ణ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉందట. కానీ, మేకర్స్ నుంచి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ తెలుగు-తమిళ ద్విభాషా మూవీలో లీడ్ రోల్‌లో ఫుల్ బిజీ.

తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ రోల్స్‌లో ఈజీగా స్కోర్ చేసే విజయ్ సేతుపతి అల్లు అట్లీ కాంబో మూవీలో జాయిన్ అయితే.. ఈ మూవీ హైప్ మరో లెవెల్‌కి వెళ్లిపోతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తూ, గ్లోబల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News