సోషల్ మీడియాలో రీయాక్టివేట్ అయింది !
ఇటీవల, ఆమె వివాహంలో సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పలు మీడియా సంస్థలు వీరి విడాకుల గురించి ఊహాగానాలు చేశాయి. ఈ సమయంలో హన్సిక ఎలాంటి స్పందనా ఇవ్వకపోవడం రూమర్స్‌కి మరింత ఆజ్యం పోసింది.;
‘దేశముదురు’ బ్యూటీ హన్సికా మోత్వానీ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో రీయాక్టివేట్ అయింది. దాదాపు ఐదు వారాల తర్వాత, ఆమె తన బాలీ వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. హన్సిక, సోహెల్ ఖతూరియాతో 2022లో జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ సెరెమనీలో పెళ్లి చేసుకుంది. ఈ జంట 2024 డిసెంబర్‌లో తమ రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంది.
ఇటీవల, ఆమె వివాహంలో సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పలు మీడియా సంస్థలు వీరి విడాకుల గురించి ఊహాగానాలు చేశాయి. ఈ సమయంలో హన్సిక ఎలాంటి స్పందనా ఇవ్వకపోవడం రూమర్స్‌కి మరింత ఆజ్యం పోసింది. అయితే, ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్‌లో స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆ ఫోటోల్లో ఆమె సంతోషంగా, ఉత్సాహంగా ఉంది.
హన్సికాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రూమర్స్ మొదలయ్యే వరకు ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. తరచూ రీల్స్, అప్‌డేట్స్ షేర్ చేసేది. ఆమె హఠాత్తుగా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడం ఊహాగానాలకు కారణమైంది, కానీ ఆమె తిరిగి రావడం ఆ గాసిప్స్‌ని పక్కన పెట్టి ముందుకు సాగాలనే సంకేతంగా కనిపిస్తోంది.