శ్రుతి డిజిటల్ డిటాక్స్!
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సడెన్‌గా సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.;
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సడెన్‌గా సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రుతి, తన లైఫ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
కానీ ఇప్పుడు ఆమె కొన్ని రోజులు 'నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా' అంటూ పోస్ట్ చేయడంతో, ఇది ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్యమైన కారణం ఇటీవల ఆమె ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ కావడమేనని భావిస్తున్నారు. అకౌంట్ నుంచి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లింకులు పోస్ట్ కావడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. తర్వాత ఆమె స్వయంగా ఇది హ్యాకింగ్ అని వెల్లడిస్తూ అభిమానులను హెచ్చరించింది. ఈ ఘటనల కారణంగానే శ్రుతి తాత్కాలికంగా డిజిటల్ డిటాక్స్ తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, శ్రుతి ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంతో రాబోతుంది. రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి భారీ తారాగణం ఇందులో నటించగా, పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయటం విశేషం. ఇక 'కూలీ' రిలీజ్ కు ముందు శ్రుతి డిజిటల్ డిటాక్స్ నిర్ణయం తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అయ్యింది.