టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

ప్రముఖ సినీ నటుడు విజయ రంగరాజు (అలియాస్ రాజ్ కుమార్) గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.;

By :  S D R
Update: 2025-01-20 07:33 GMT

ప్రముఖ సినీ నటుడు విజయ రంగరాజు (అలియాస్ రాజ్ కుమార్) గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. గత వారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ ఆయన, వైద్యం కోసం చెన్నై వెళ్లినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


1994లో విడుదలైన ‘భైరవ ద్వీపం‘ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన విజయ రంగరాజు, తన నటనా ప్రావీణ్యంతో సహాయ పాత్రలు, విలన్ పాత్రలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం‘ సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించారు.


నటనా రంగం మాత్రమే కాకుండా, విజయ రంగరాజు వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ రంగాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. విజయ రంగరాజు అకాలమరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన చేసిన పాత్రలు, సినిమాలకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి.

Tags:    

Similar News