బాలీవుడ్‌కి మరో లిటిల్ ప్రిన్సెస్
బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న జంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాలు తల్లిదండ్రులుగా మారారు. 2023లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు తాజాగా పండంటి ఆడబిడ్డ జన్మించింది.;
బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న జంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాలు తల్లిదండ్రులుగా మారారు. 2023లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు తాజాగా పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ శుభవార్తతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ‘భరత్ అనే నేను’ సినిమాతో పరిచయమైన కియారా, ఆ తర్వాత ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో పెద్గా హిట్లు లేకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్థ్ ‘పరమ సుందరి’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.
ఈ మధ్య బాలీవుడ్ స్టార్ జంటలకు ఆడబిడ్డలు పుట్టడం విశేషంగా మారింది. అలియాభట్-రణబీర్, దీపికా-రణవీర్ జంటలకు కూడా ఇటీవల ఆడబిడ్డలు పుట్టారు. ఇప్పుడు కియారా-సిద్దార్థ్ దంపతులు కూడా ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు కియారా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చే అవకాశం ఉంది. బిడ్డకు పూర్తిగా సమయం కేటాయించిన తర్వాత, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.