తండేల్ ఈవెంట్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ వివరణ
By : Surendra Nalamati
Update: 2025-02-10 12:55 GMT
తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజును స్టేజ్‌పై ఆహ్వానిస్తూ, "వారం రోజుల వ్యవధిలోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్ అన్నీ చూసేశాడు" అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాటలు గేమ్ ఛేంజర్ సినిమాపై సెటైర్ వేశారనే అభిప్రాయంతో ట్రోలింగ్‌కు గురయ్యారు. ముఖ్యంగా మెగా అభిమానులు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. "రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు. అతనికి ఉన్న ఒకే ఒక మేనమామను నేను. మా మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన అనుబంధమే ఉంటుంది. అనుకోకుండా అన్న మాటలు కావొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను" అని స్పష్టత ఇచ్చారు.