సితార సంస్థలో అఖిల్ సినిమా
అక్కినేని వారసుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్. చిన్నప్పుడే ‘సిసింద్రీ‘గా అదరగొట్టిన అఖిల్ కి హీరోగా మారిన తర్వాత అసలు సిసలు హిట్ లభించలేదు.;
అక్కినేని వారసుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్. చిన్నప్పుడే ‘సిసింద్రీ‘గా అదరగొట్టిన అఖిల్ కి హీరోగా మారిన తర్వాత అసలు సిసలు హిట్ లభించలేదు. అతను చేసిన ఐదు చిత్రాలలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘ ఒకటే కాస్తో కూస్తో బెటర్. ఇక ‘ఏజెంట్‘ వంటి డిజాస్టర్ తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాని ప్రకటించలేదు.
అఖిలో తో సినిమాకోసం ఇద్దరు, ముగ్గురు దర్శకుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. వాటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ ఫేమ్ మురళీ కృష్ణ ఒకడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ 6వ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ అందించారు నిర్మాత నాగవంశీ.
అఖిల్ 6వ చిత్రానికి సంబంధించి అనౌన్స్ మెంట్ ఏప్రిల్ 8న రాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కొత్త సినిమా ప్రకటన రాబోతుందన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ విషయాలు ఆ రోజే తెలియనున్నాయి.