అన్నపూర్ణలో 'అఖండ' యాక్షన్!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ – మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండగ.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ – మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండగ. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఈ ఇద్దరూ సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగించేందుకు వీరి కలయికలో ‘అఖండ 2 – తాండవం’ వస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చాలా భాగం షూటింగ్ పూర్తైంది. అన్నపూర్ణ స్టూడియోలో వేస్తోన్న ప్రత్యేక సెట్‌లో వచ్చే వారం నుంచి బాలయ్యపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ రెడీ అవుతుంది. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ ఏడాది దసరా కానుకగా 'అఖండ 2' విడుదల కానుంది.