'అఖండ 2' టీజర్ సెన్సేషన్!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్, 590K లైక్స్ సంపాదించిన ఖ్యాతిని దక్కించుకుంది.;

By :  S D R
Update: 2025-06-10 15:17 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్, 590K లైక్స్ సంపాదించిన ఖ్యాతిని దక్కించుకుంది. ఇప్పటికీ ఈ టీజర్ యూట్యూబ్ లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు 'అఖండ 2'తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టబోతున్నారు.

తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం 'అఖండ 2'కి టెక్నికల్ గా ఎంతో ప్లస్ కానున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న 'అఖండ 2' ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News