కోలీవుడ్ లో సూపర్ ఛాన్స్ కొట్టేసింది !

కోలీవుడ్ వర్గాల్లో తాజా బజ్ ప్రకారం.. ఈ కన్నడ సుందరి అజిత్ కుమార్ నెక్స్ట్ మూవీలో నటించే అవకాశం ఉంది.;

By :  K R K
Update: 2025-08-08 01:45 GMT

టాలీవుడ్ అందాల హీరోయిన్ శ్రీలీల ఆఖరిసారిగా 'జూనియర్' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో కనిపించింది. 'వైరల్ వయ్యారి' పాటలో తన కిల్లర్ డాన్స్ మూవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంది ఆ పాట ఇప్పటికీ ప్లేలిస్ట్‌లలో రాజ్యమేలుతోంది. ఇక ఈ ఏడాది శ్రీలీల కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించే ఓ రొమాంటిక్ డ్రామాతో.. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

కోలీవుడ్ వర్గాల్లో తాజా బజ్ ప్రకారం.. ఈ కన్నడ సుందరి అజిత్ కుమార్ నెక్స్ట్ మూవీలో నటించే అవకాశం ఉంది. తమిళ స్టార్ హీరో అజిత్ ఆఖరిసారిగా అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కనిపించాడు. అధిక్ వర్కింగ్ స్టైల్‌తో ఇంప్రెస్ అయిన అజిత్, అతనికి తన 64వ చిత్రం 'ఏకే64' కోసం మరో ఛాన్స్ ఇచ్చాడు.

ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా లేదా మరో కీలక పాత్రలో నటిస్తుందా అనేది స్పష్టం కాలేదు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.

Tags:    

Similar News