శ్రీలంకలో విడుదల కాబోతున్న ‘కింగ్ డమ్’
కింగ్‌డమ్ తమిళ వెర్షన్ ఆగస్టు 8, 2025న సుమారు 20 థియేటర్లలో రిలీజ్ కానుంది.;
By : K R K
Update: 2025-08-07 10:24 GMT
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు శ్రీలంకలో విడుదలకు సిద్ధమవుతోంది.
కింగ్‌డమ్ తమిళ వెర్షన్ ఆగస్టు 8, 2025న సుమారు 20 థియేటర్లలో రిలీజ్ కానుంది. అక్కడ ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ చిత్రం ద్వారా మోలీవుడ్ నటుడు వెంకిటేష్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ బహుభాషా చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు.