నెవర్ బిఫోర్ లుక్‌లో నాని
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ ఇప్పుడు 'ది ప్యారడైజ్' అంటూ ఓ డిఫరెంట్ రోల్ తో ఆడియన్స్ ను అలరించబోతున్నాడు.;
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ ఇప్పుడు 'ది ప్యారడైజ్' అంటూ ఓ డిఫరెంట్ రోల్ తో ఆడియన్స్ ను అలరించబోతున్నాడు. ఇప్పటికే నానికి 'దసరా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన 'ది ప్యారడైజ్' నుంచి నాని ఫస్ట్ లుక్ వచ్చింది.
నాని ఇప్పటివరకూ కనిపించనటువంటి కొత్త అవతారంలో 'ది ప్యారడైజ్' కోసం మేకోవర్ అయ్యాడు. లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ లో రెండు జడలు, గుబురు గడ్డం, నల్ల కళ్ల జోడు, చెవులు, ముక్కులకు రింగులతో నాని మేకోవర్ ఎంతో రస్టిక్‌గా, సరికొత్తగా ఉంది. ఈ పోస్టర్ లో చుట్టూరా మారణాయుధాలతో కనిపిస్తున్నాడు నాని. మొత్తంగా.. ఈసారి 'దసరా'కి మించి 'ది ప్యారడైజ్'తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు నాని-శ్రీకాంత్ ఓదెల.
ఎస్.ఎల్.వి. సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 2026, మార్చి 26న 'ది ప్యారడైజ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.