సూర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మి ?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల విషయంలో ప్రస్తుతం తన స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సూర్య.. ఆ ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉండగానే తన తదుపరి సినిమా ‘వాడివాసల్’ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఈ సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనుండగా, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను దీన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నుండి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ముఖ్య తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకు జోడీగా మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేసే ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఈ చిత్రం తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును కేంద్రంగా తీసుకుని ఆసక్తికరమైన కథాంశంతో రూపుదిద్దుకోనుంది. ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేసే యోచన ఉందని నిర్మాత స్పష్టం చేశారు.