‘ఆదిత్య 369‘ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత ప్రాముఖ్యత గల చిత్రాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. టైమ్‌ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా 1991లో విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.;

By :  S D R
Update: 2025-03-18 11:13 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత ప్రాముఖ్యత గల చిత్రాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. టైమ్‌ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా 1991లో విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అదరగొట్టాడు.

ఇప్పటికీ అందరికీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే ఈ సినిమా, ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. 4K వెర్షన్‌లో రీమాస్టర్‌ చేసి, ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇళయరాజా అద్భుతమైన సంగీతంతో, విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రంలో మోహిని కథానాయికగా నటించగా, టిన్ను ఆనంద్, అమ్రీష్ పూరి, సిల్క్ స్మిత వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆదిత్య 369’ విజయంతో ప్రేరణ పొందిన చిత్రాల్లో ప్రభాస్ ‘కల్కి’ కూడా ఒకటి. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షఙ్ఞ హీరోగా ‘ఆదిత్య 369‘కి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ రూపొందనుంది.

Tags:    

Similar News