20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ జోడీ ?

Update: 2025-02-20 14:09 GMT

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇటీవల ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అతడి తాజా చిత్రం ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’ గా విడుదలైంది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో.. మరో బ్లాక్ బస్టర్ హిట్ తో అజిత్ మళ్లీ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అజిత్ నెక్స్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో నటించబోతోందని టాక్ . దాదాపు రెండు దశాబ్దాల క్రితం అజిత్‌కు జోడీగా ‘వాలి’ అనే మూవీలో నటించి.. బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆమె.. మళ్ళీ ఇన్నాళ్ళకు అతడితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం విశేషం.

1990ల చివరలో.. 2000ల ప్రారంభంలో తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రనటిగా వెలుగొందిన సిమ్రాన్, ప్రస్తుతం ప్రత్యేకమైన గెస్ట్ రోల్స్, తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో ఆమె పాత్ర నోస్టాల్జియా ఫీలింగ్ ను కలిగించేలా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈ నెల చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఈ మూవీ అజిత్‌కు మళ్లీ విజయాన్ని అందిస్తుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News