బుచ్చిబాబుకి ప్రత్యేకమైన బహుమతి

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల 40వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన గిఫ్టులను అందించాడు. ఈ లిస్టులో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నాడు.;

By :  S D R
Update: 2025-04-04 07:39 GMT

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల 40వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన గిఫ్టులను అందించాడు. ఈ లిస్టులో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతుల నుంచి తనకు అందిన ప్రత్యేకమైన బహుమతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు షేర్ చేసిన పోస్ట్, గిఫ్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ తో ‘పెద్ది‘ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా చరణ్ కు మరో ‘రంగస్థలం‘ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏప్రిల్ 6న ‘పెద్ది‘ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతుంది.

https://x.com/BuchiBabuSana/status/1908008651639652463

Tags:    

Similar News