వంద కోట్ల సెలబ్రేషన్!

తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.;

By :  S D R
Update: 2025-04-14 06:47 GMT

తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం, నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అజిత్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడులో తొలిరోజే రూ. 28.5 కోట్లు వసూలు సాధించింది. ఈ ఏడాది కోలీవుడ్ నుంచి హైయ్యస్ట్ ఓపెనింగ్ మూవీ ఇదే. అమెరికాలో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది. ఈ చిత్రంలోని అజిత్ స్వాగ్, స్టైల్, యాక్షన్ సీక్వెన్సెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మరోవైపు ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ రూ. 95 కోట్లకు సొంతం చేసుకుందట. ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటించింది. ఇతర కీలక పాత్రల్లో సిమ్రాన్, సునీల్, ప్రసన్న, అర్జున్ దాస్ వంటి వారు నటించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News