చాలా కాలం తర్వాత జగ్గూభాయ్ కి మంచి పనిపెట్టిన సినిమా !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో 16వ చిత్రంగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. "గేమ్ ఛేంజర్" తర్వాత రాబోతున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోసారి సుకుమార్ కాంపౌండ్ నుండి వచ్చిన టీంతో చరణ్ పని చేస్తుండటంతో పాజిటివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో జగపతిబాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన "రంగస్థలం" చిత్రంలో జగపతిబాబు గ్రామ ప్రెసిడెంట్‌గా చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ చరణ్‌తో కలిసి మరో సాలిడ్ రోల్ చేయబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా, జగపతిబాబు తన మేకప్ రూమ్ నుంచి వీడియోతో ఒక పోస్ట్ చేస్తూ, "చాలా కాలం తర్వాత బుచ్చిబాబు నాకు మంచి పని పెట్టాడు. 'చరణ్ 16'లో నా గెటప్ చూసాక చాలా తృప్తిగా అనిపించింది," అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సినిమా పై హైప్‌ను మరింత పెంచాయి. జగపతిబాబు పాత్రతో పాటు ఈ చిత్రంలోని ఇతర విశేషాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.