సొంతింటి కలతో సాగే '3 BHK'

మధ్యతరగతి కుటుంబం జీవితాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తూ, సొంతిల్లు అనే కల చుట్టూ రూపొందిన సినిమా ‘3 BHK’. సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ జులై 4న విడుదలకానుంది.;

By :  S D R
Update: 2025-06-27 14:40 GMT

మధ్యతరగతి కుటుంబం జీవితాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తూ, సొంతిల్లు అనే కల చుట్టూ రూపొందిన సినిమా ‘3 BHK’. సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ జులై 4న విడుదలకానుంది.

శరత్ కుమార్ – సిద్ధార్థ్ తండ్రీ కొడుకులుగా నటించిన ఈ చిత్రంలో దేవయాని, యోగిబాబు, చైత్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఎంతో భావోద్వేగంగా ఆకట్టుకుంటోంది. ఓ సామాన్య కుటుంబం తమ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి ఎదుర్కొనే ఆర్థిక ఒడిదొడుకులు, భావోద్వేగాలు, తండ్రి-కొడుకు మధ్య ఉన్న బంధం ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శ్రీ గణేష్ దర్శకత్వం వహించగా, అరుణ్ విశ్వ ‘శాంతి టాకీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సొంతిల్లు ఒక ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు అది గౌరవం, స్థిరత్వం, సంతృప్తికి ప్రతీక అని ట్రైలర్ చెబుతోంది. ఈ ఎమోషనల్ జర్నీ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది.


Full View


Tags:    

Similar News