మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కోసం మహేశ్ చైనా ప్రయాణం !

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా కోసం మహేష్ ఇప్పటికే జపాన్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడు.;

By :  T70mm Team
Update: 2025-01-11 07:22 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా కోసం మహేష్ ఇప్పటికే జపాన్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఇటీవల ఆఫ్రికాలోని మసాయి, పిగ్మీస్ తెగల మధ్య కూడా 20 రోజుల పాటు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మహేష్ చైనాలోని ఒక ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సంస్థలో శిక్షణ పొందేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ నెల మధ్యలో మహేష్ చైనా ప్రయాణం ఉంటుందని.. అక్కడ ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌లో ప్రావీణ్యం సాధిస్తాడని తెలుస్తోంది. మరింతగా.. ఈ శిక్షణ కార్యక్రమంలో రాజమౌళి కూడా మహేష్‌తో పాటు పాల్గొంటారని సమాచారం.

ఈ చిత్ర షూటింగ్‌కు ముందు ఇన్ని రకాల ట్రైనింగ్‌లను పూర్తి చేయడం చిన్న విషయమేమీ కాదు. జపాన్, ఆఫ్రికా, చైనా ఇలా వివిధ దేశాలలో ట్రైనింగ్ తీసుకుంటున్న మహేష్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమా కోసం ఆయన పట్టుదల మరియు కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలోనూ శ్రమించడం మహేష్‌కి ఉన్న నిబద్ధతను సూచిస్తుంది.

ఈ సినిమాలోని ప్రధానమైన భాగం ఆఫ్రికన్ అడవుల్లోనే చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ సెట్లు నిర్మాణంలో ఉన్నాయని తెలుస్తోంది. ఇన్ని ప్రత్యేక శిక్షణలు మరియు భారీ ప్రొడక్షన్ సెటప్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయనటంలో సందేహం లేదు.

Similar News