ఆకట్టుకుంటున్న మమ్ముట్టి కొత్త సినిమా సెకండ్ లుక్

ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదలైంది.;

By :  K R K
Update: 2025-04-20 11:11 GMT

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, ‘జైలర్’ విలన్ వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కళన్ కావల్’. ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదలైంది. "కొన్ని ముఖాలు ప్రశ్నలను కలిగిస్తాయి... సమాధానాలను కాదు..." అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్‌లో మమ్ముట్టి తీవ్రమైన భావం, చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిగరెట్ నోట్లో పెట్టుకొని కొంతమంది తో గొడవ పడుతున్న మమ్ముట్టి ఆకట్టుకున్నారు. ఈ రెండు పోస్టర్స్ తో మమ్ముటి పాత్రపై ఎంతో ఆసక్తితో ఉన్నారు అభిమానులు. ఇంక ఈ చిత్రానికి జితిన్ కె జోస్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన "కురుప్" సినిమాకు కథ రాసిన జితిన్, ఇప్పుడు ఈ సినిమాకు జిష్ణు శ్రీకుమార్‌తో కలిసి స్క్రీన్‌ప్లే కూడా రచించారు. ఇందులో మమ్ముట్టి గ్రే షేడ్ ఉన్న పాత్రను పోషించనున్నారు. వినాయకన్‌తో పాటు జిబిన్ గోపీనాథ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని మమ్ముట్టి తన సొంత బ్యానర్ మమ్ముట్టి కంపనీ ద్వారా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ఫైజల్ అలీ నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రవీణ్ ప్రభాకర్ స్వీకరించారు. సంగీతాన్ని "కిష్కింద కాండం" ఫేమ్ ముజీబ్ మజీద్ అందిస్తున్నారు.

Tags:    

Similar News