పూరీ జగన్నాథ్ @ 25
చిత్తశుద్ధి, ధైర్యంతో ముందుకెళ్లే వారు నిజంగా డైనమిక్ పర్సనాలిటీలు. అలాంటి అరుదైన వ్యక్తులలో పూరీ జగన్నాథ్ ఒకడు.;
చిత్తశుద్ధి, ధైర్యంతో ముందుకెళ్లే వారు నిజంగా డైనమిక్ పర్సనాలిటీలు. అలాంటి అరుదైన వ్యక్తులలో పూరీ జగన్నాథ్ ఒకడు. మాటల్లోనూ, మేకింగ్‌లోనూ తనదైన శైలితో సినిమా ప్రపంచానికి కొత్త దిశ చూపిన ఈ డైరెక్టర్, నేటికి పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
పూరీ దృష్టిలో సినిమా మాధ్యమం కాదు – వ్యామోహం. సాధారణ సన్నివేశాన్నే అద్వితీయంగా మలిచే శక్తి, పేజీల డైలాగ్స్ అవసరం లేకుండా ఒకే మాటతో మెసేజ్ ఇవ్వగల అద్భుతం పూరీ స్టైల్. ఆయన డైరెక్షన్‌లో డైనమిజం, పవర్, ఎమోషన్ అన్నీ ఉంటాయి.
పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి‘. పవన్ కళ్యాణ్ హీరోగా ఏప్రిల్ 20, 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఈ చిత్రం ఘన విజయంతో పూరీకి ఓవర్‌నైట్ ఫేమ్ వచ్చేసింది. అప్పుడు మొదలైన ‘పూరీయిజం’ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని.. నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్.. ‘అతను డైలాగ్ రాస్తే థియేటర్లు హోరెత్తుతాయి.. అతను హీరోను ఫ్రేమ్‌లో పెడితే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు.. అతను కథను మౌంట్ చేస్తే అది కల్ట్ అవుతుంది... మాస్ కమర్షియల్ సినిమాకు బాప్ అయిన పూరీ 25 ఏళ్ల సినిమా ప్రస్థానానికి ఘనంగా శుభాకాంక్షలు‘ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త సినిమా చేస్తున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.