సూర్య సినిమాకోసం భారీ సెట్!
తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా.. విలక్షణ నటుడు సూర్య చేసిన తెలుగు సినిమా ఒకటే ఒకటి. అది రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'.;
తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా.. విలక్షణ నటుడు సూర్య చేసిన తెలుగు సినిమా ఒకటే ఒకటి. అది రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'. ఈ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ చివరిలో కనిపించే సూర్య.. 'రక్త చరిత్ర' సెకండ్ పార్ట్ లో ఎక్కువ నిడివి గల పాత్రలో కనిపించాడు. ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.
చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు సూర్య తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ కాంబోని సెట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ కాంబో జూన్ నుంచి పట్టాలెక్కబోతుంది.
సూర్య సినిమాకోసం లేటెస్ట్ గా ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. తొలి షెడ్యూల్ లో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించనున్నారట. రెండు వారాల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట భాగ్యశ్రీ పేరు వినిపించినా.. 'డ్రాగన్' బ్యూటీ కాయదు లోహర్ ను ఫైనల్ చేసినట్టు టాక్. సూర్య స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నాడట 'లక్కీ భాస్కర్' డైరెక్టర్ వెంకీ అట్లూరి.