'వార్ 2' ట్రైలర్ డే!
బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ వంటి సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ కలయికలో రూపొందిన క్రాస్ ఓవర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.;
బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ వంటి సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ కలయికలో రూపొందిన క్రాస్ ఓవర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఇప్పటికే సూపర్ హిట్టైన 'వార్'కి సీక్వెల్ గా, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో భాగంగా ఈ చిత్రం రాబోతుంది.
ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్న 'వార్ 2' మూవీ ట్రైలర్ ఈరోజే విడుదలవుతుంది. ఈ ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ ను చూసిన కొంతమంది క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ట్రైలర్ లో హృతిక్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలవనున్నాయని చెబుతున్నార.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయన్ ముఖర్జీ దర్శకుడు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి సారిగా డాల్బీ సినిమా వెర్షన్‌లో విడుదల కాబోతున్న ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రీతమ్ సంగీతం, సంచిత్ – అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్. మొత్తంగా.. మరికొద్ది గంటల్లోనే 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ కానుంది.