మారేడుమిల్లిలో 'అఖండ' తాండవం!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ జోడీ ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ కోసం మరోసారి జట్టు కట్టారు.;

By :  S D R
Update: 2025-07-25 01:19 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ జోడీ ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ కోసం మరోసారి జట్టు కట్టారు. 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్‌పై రామ్, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. 'అఖండ' చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కి తమన్ మ్యూజికల్ మ్యాజిక్ మరింత ప్లస్ అవుతుందని భావిస్తోంది టీమ్.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్తా మీనన్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా అలరించబోతున్నాడు. ప్రస్తుతం 'అఖండ 2' షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

మరోవైపు 'అఖండ 2'ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని భావించారు. కానీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న ఈ మూవీని అద్భుతమైన విజువల్ ట్రీట్ తో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో.. దసరా సమయానికి వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తి కావడం కష్టమే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఈనేపథ్యంలోనే దసరా బరి నుంచి 'అఖండ 2' తప్పుకునే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News