ఈ వారం ఓటీటీ సినిమాలు

ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కోసం పలు ఆసక్తికరమైన సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-05-07 02:24 GMT

ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కోసం పలు ఆసక్తికరమైన సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్ హుడ్' జీ5 వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ గా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

అయితే.. నితిన్, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, జి.వి.ప్రకాష్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జీ5 వేదికగా మే 10 నుంచి ‘రాబిన్ హుడ్‘ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘జాక్‌’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 10న వేసవి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

రేపటి (మే 8) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'జాక్' స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా 'జాక్' అందుబాటులోకి రానుంది. గతంలో 'డీజె టిల్లు, టిల్లు స్క్వేర్' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న సిద్దు హిట్ పరంపరకు 'జాక్' బ్రేక్ వేసింది. అయితే.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

మరోవైపు కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అజిత్, త్రిష జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడు. తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయినా.. తమిళంలో మాత్రం ఈ మూవీకి మంచి స్పందన దక్కింది. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కి నిజమైన ఫెస్టివల్‌లా మారింది.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రేపటి (మే 8) నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతుంది నెట్‌ఫ్లిక్స్. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. యాక్షన్, స్టైల్, సెంటిమెంట్ మిక్స్ తో వచ్చిన ఈ చిత్రం ఓటిటి ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలున్నాయి.

Tags:    

Similar News