'కూలీ' నుంచి మోనిక వచ్చేసింది!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్.;

By :  S D R
Update: 2025-07-11 12:44 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్.ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన 'చికిటు' సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ 'మోనిక' రిలీజ్ చేశారు. ఓ సీ పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లో చిత్రీకరించిన ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే పూర్తిగా గ్లామరస్ అవతార్ లో సందడి చేసి ఆకట్టుకుంటుంది.

అనిరుధ్ సంగీతంలో సుభాషిణి, అనిరుధ్ కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో 'మంజుమ్మల్ బాయ్స్' ఫేమ్ సౌబిన్ షాహిర్ మరో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాడు. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం ఉంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీని ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.


Full View


Tags:    

Similar News