రాజమౌళి లాంఛ్ చేసిన 'జూనియర్'!

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘జూనియర్’.;

By :  S D R
Update: 2025-07-11 14:13 GMT

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌లో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ రవిచంద్రన్, సీనియర్ హీరోయిన్ జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి లాంఛ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఇదొక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాలేజ్ స్టూడెంట్ అయిన అభి ప్రేమలో పడటం, అతని జీవితంలో జరిగే అనూహ్య మలుపులు, తండ్రి పాత్రలో ఉన్న బాధలు, ఊరిలోని సమస్యలు ఈ సినిమా ప్రధాన కథ. లవ్, కామెడీ, ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్ తో ఈ సినిమాని డైరెక్టర్ మలిచినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

కిరీటీ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తొలి సినిమాకే నటనలో మంచి ఈజ్ కనబరుస్తున్నాడు. శ్రీలీల గ్లామర్, జెనీలియా స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం జులై 18న పాన్ ఇండియా లెవెల్ లో 'జూనియర్' రిలీజ్ కానుంది.


Full View


Tags:    

Similar News