బాక్సాఫీస్ వద్ద సందడే సందడి!
ఈ ఏడాది ప్రథమార్థంలో టాలీవుడ్ కి ఆశించిన ఫలితాలు రాలేదు. కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మ్యాజిక్ చేయగా.. భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు మిశ్రమ ఫలితాలను అందించాయి.;
ఈ ఏడాది ప్రథమార్థంలో టాలీవుడ్ కి ఆశించిన ఫలితాలు రాలేదు. కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మ్యాజిక్ చేయగా.. భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. సంక్రాంతి తర్వాత మళ్లీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాల సందడి నెలకొనబోతుంది. కేవలం మూడు వారాలలో నాలుగు క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి.
ముందుగా జూలై 24న రిలీజ్ కు రెడీ అవుతుంది పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు. పవన్ రాజకీయంగా డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా ఇది. నాలుగేళ్లుగా డిలే అవుతూ చివరకు జులై 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. పవర్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ కాస్ట్యూమ్ డ్రామా కావంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాల పర్ఫార్మెన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటే, 'కింగ్డమ్' కంపల్సరీ హిట్ అవ్వాల్సిన చిత్రం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, నాగవంశీ ప్రొడక్షన్ వేల్యూస్, పీరియాడక్ బ్యాక్‌డ్రాప్.. ఇవన్నీ కలిపి సినిమా మీద ఆసక్తి పెంచుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూలై 31న రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు మేకర్స్.
యష్ రాజ్ ఫిల్మ్స్ యాక్షన్ యూనివర్స్‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ 'వార్ 2'. హృతిక్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఓ హై ఆక్టేన్ రోల్ ప్లే చేయడం ఈ సినిమాకి సౌత్‌లో భారీ క్రేజ్ తీసుకొచ్చింది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. హిందీ బెల్ట్ లో నమ్మకంగా ఉన్నా, సౌత్ లో అదే రోజు వచ్చే 'కూలీ'తో మాత్రం 'వార్ 2' పోటీ తట్టుకోవాల్సి ఉంది.
రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్‌తో లోకేష్ కనగరాజ్ రూపొందించిన బిగ్ బజెట్ ఫిల్మ్ 'కూలీ'. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కూడా ఆగస్టు 14నే థియేటర్లలోకి దిగుతోంది. రజనీ మాస్ అప్పీ్ తో పాటు, లోకేష్ మాస్టర్ మైండ్ స్క్రీన్ ప్లే, మల్టీస్టారర్ కాస్టింగ్ ఇవి కలిసొస్తే, ఇది బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయం.
మొత్తంగా ఈ నాలుగు సినిమాలు.. మూడు వారాల పాటు థియేటర్లను షేక్ చేయడం ఖాయం. మరి.. వీటిల్లో ఏ ఏ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయి అనేది వేచి చూడాలి.