కార్మికుల సమ్మె పరిష్కార దిశగా చర్చలు
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు, వర్కింగ్ కండీషన్స్ వంటి కీలక అంశాలపై గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.;
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు, వర్కింగ్ కండీషన్స్ వంటి కీలక అంశాలపై గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త వేతనాల కోసం, పనివాతావరణంలో మెరుగుల కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తొమ్మిది రోజుల పాటు చిత్రీకరణలను నిలిపివేసింది.
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ ‘రేపు జరగనున్న సమావేశంలో అంతిమ పరిష్కారం దొరకుతుందనే నమ్మకం ఉంది. చిన్న నిర్మాతల సమస్యలు, వర్కింగ్ కండీషన్స్ అంశాలపై కూడా చర్చిస్తాము. అన్నీ పాజిటివ్‌గా ముగుస్తాయని విశ్వసిస్తున్నాం‘ అని తెలిపారు.
అలాగే మంత్రి కోమటిరెడ్డి తమతో మాట్లాడినప్పుడు ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి‘ అని సూచించినట్టు అనిల్ తెలిపారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఫెడరేషన్ కో ఆర్డినేషన్ మెంబర్స్ , ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్టు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.యల్. దామోదర్ ప్రసాద్ కూడా తెలిపారు. మొత్తంగా.. రేపు జరగనున్న చర్చలతో కార్మికుల సమ్మె కు పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.