కూలీ vs వార్ 2.. గెలిచేదెవరు?
ఆగస్టు 14న అంటే రేపు ఇండియన్ సినిమా హిస్టరీలో అరుదైన సంఘటన జరగబోతోంది. రెండు ఇండస్ట్రీలు, పలువురు సూపర్‌స్టార్‌లు, రెండు వేర్వేరు మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్లు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.;
ఆగస్టు 14న అంటే రేపు ఇండియన్ సినిమా హిస్టరీలో అరుదైన సంఘటన జరగబోతోంది. రెండు ఇండస్ట్రీలు, పలువురు సూపర్‌స్టార్‌లు, రెండు వేర్వేరు మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్లు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక వైపు రజనీకాంత్ – నాగార్జున కాంబోతో ‘కూలీ’, మరో వైపు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబోతో ‘వార్ 2’ ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నాయి.
ఈ రెండు సినిమాలలోనూ కథ విషయాన్ని పక్కన పెడితే స్టార్ పవర్ బలంగా కనిపిస్తుంది. 'కూలీ' చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తే.. విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున కనువిందు చేయబోతున్నాడు. ఇంకా.. సపోర్టింగ్ కాస్ట్ విషయంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అతిథి పాత్రలోనూ, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లోనూ సందడి చేయబోతున్నారు. లోకేష్ కనకరాజ్ స్టైల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, రజనీకాంత్ స్టైల్, పలు భాషల నుంచి నటించిన స్టార్స్, అనిరుధ్ మ్యూజికల్ మ్యాజిక్ 'కూలీ' మూవీకి మెయిన్ అసెట్.
మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే హృతిక్ రోషన్.. హీరో అనే పదానికి అసలు సిసలు నిర్వచనం. బాలీవుడ్ లో అతిపెద్ద యాక్షన్ ఐకాన్ అయిన హృతిక్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించడం మరో క్రేజీ న్యూస్. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో 'వార్ 2'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. హై-ఆక్టేన్ యాక్షన్, స్పై యూనివర్స్ కనెక్ట్, హాలీవుడ్-లెవెల్ విజువల్స్ తో 'వార్ 2' ఆడియన్స్ లో ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకుంది.
'కూలీ' చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో చేసింది. సౌత్ మార్కెట్‌లో 'కూలీ' డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ దక్కుతున్నాయి. అలాగే తెలుగులో నాగార్జున ఫ్యాన్ బేస్ వల్ల బలమైన బజ్ ఏర్పడింది.
మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే నార్త్ లో హృతిక్ రోషన్ క్రేజ్, తెలుగులో ఎన్టీఆర్ మ్యానియా ఈ మూవీకి బాగా కలిసొచ్చాయి. హిందీ బెల్ట్‌లో రికార్డు స్థాయి బుకింగ్స్ ఇప్పటికే రాగా, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవ్వగానే భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లలోనూ 'వార్ 2'కి మంచి క్రేజుంది. మొత్తంగా.. మరికొద్ది గంటల్లో ఈ రెండు సినిమాల రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.