ఆంధ్రప్రదేశ్‌లో ‘వార్-2’కు ప్రత్యేక షోలు!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్-2’ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొద్ది గంటల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్-2’ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొద్ది గంటల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇప్పటికే 'వార్ 2' చిత్రానికి తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమవ్వగా.. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లోనూ బుకింగ్స్ షురూ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'వార్ 2' కోసం ప్రత్యేక షో అనుమతితో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, సినిమా విడుదల రోజు 14.08.2025 ఉదయం 5 గంటలకు అదనపు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షోకు ప్రతి టికెట్ ధర రూ.500/- (GST సహా)గా నిర్ణయించారు.
అలాగే, ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకు టికెట్ రేట్ల పెంపు కూడా అమల్లోకి రానుంది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్స్‌లో సాధారణ రేటుపై అదనంగా రూ.75/- (GST సహా), మల్టీప్లెక్స్‌లలో సాధారణ రేటుపై అదనంగా రూ.100/- (GST సహా) వసూలు చేయనున్నారు. ఈ పెంపు ప్రస్తుత టికెట్ ధరలపై అదనంగా ఉండనుంది. అయితే, ప్రభుత్వం ఒక షరతు విధించింది. రోజుకు గరిష్టంగా ఐదు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని థియేటర్లకు వర్తిస్తాయి.