'రంగస్థలం' జోడీ రీఎంట్రీ!
'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సమంత జోడీ మళ్లీ తెరపైకి రానుందన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఈసారి వీరిద్దరూ హీరో-హీరోయిన్లుగా కాదు.. మాస్ ఆడియన్స్‌ను ఉర్రత్తలూగించే స్పెషల్ సాంగ్‌లో.;
'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సమంత జోడీ మళ్లీ తెరపైకి రానుందన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఈసారి వీరిద్దరూ హీరో-హీరోయిన్లుగా కాదు.. మాస్ ఆడియన్స్‌ను ఉర్రత్తలూగించే స్పెషల్ సాంగ్‌లో.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక, సినిమాలోని ఓ ప్రత్యేకపాట కోసం పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత, చివరికి సమంతను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో చేసిన ‘ఊ అంటావా మావ..’ పాటతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత, ఆ తర్వాత మరే స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇప్పుడు సామ్.. రామ్ చరణ్ సరసన స్టెప్పేయడానికి సిద్ధమవుతోందట.
మాస్ బీట్‌తో పాటు శ్రీకాకుళం జానపద శైలిని కలిపి, క్లాస్-మాస్ ఆడియన్స్ ఇద్దరికీ కనెక్ట్ అయ్యేలా రెహమాన్ ఈ పాటను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ‘రంగస్థలం’లో చరణ్-సమంత కెమిస్ట్రీ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ, ఈ క్రేజీ కాంబో మరోసారి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇవ్వనుందన్న హైప్ ఇప్పటికే పీక్‌కి చేరుకుంది. వచ్చే ఏడాది చరణ్ బర్త్‌డే స్పెషల్ గా మార్చి 27న 'పెద్ది' రిలీజ్ కానుంది.