ఆస్కార్ ను టార్గెట్ చేసిన SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ SSMB29.;

By :  S D R
Update: 2025-07-18 01:21 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ SSMB29. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, కథకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడం, సెట్స్ పై గోప్యత పాటించడంలో జక్కన్న ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

RRR సినిమాతో ఆస్కార్‌ వేదికను తాకిన రాజమౌళి, ఈసారి SSMB29 సినిమాను నేరుగా హాలీవుడ్ కేటగిరీలో నామినేట్ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాడట. ఇందుకోసం ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో సంయుక్తంగా ఈ సినిమా నిర్మించే దిశగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భారతీయ సినిమా 'ఫారిన్ కేటగిరీ' కింద మాత్రమే ఆస్కార్‌లో పోటీ పడాల్సి రావడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయని భావించిన రాజమౌళి, ఈసారి గేమ్‌ ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్వహిస్తున్నప్పటికీ, ఓ హాలీవుడ్ సంస్థను మెయిన్ ప్రొడక్షన్ హౌస్‌గా తీసుకొచ్చే యోచనలో జక్కన్న ఉన్నాడు. దాంతో ఆస్కార్ నామినేషన్లలో ప్రతిష్టాత్మక విభాగాల్లో ఛాన్స్ పెరుగుతుందని అతని విశ్వాసం.

లేటెస్ట్ గా టాంజానియాలోని ప్రముఖ పత్రిక ‘ది సిటిజన్ టాంజానియా’ ఈ సినిమా గురించి ప్రత్యేక కథనం ప్రచురించింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమా యూనిట్ జూలై మూడో వారంలో టాంజానియా చేరి సేరెంగెటి జంగిల్‌లో లొకేషన్ స్కౌటింగ్ చేపట్టనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికాలో నెక్స్ట్ షెడ్యూల్‌ జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News