SSMB29 పై పృథ్వీరాజ్ కామెంట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ 'SSMB29'. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ 'SSMB29'. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవల తన కొత్త చిత్రం 'సర్జమీన్' ప్రమోషన్స్‌లో భాగంగా 'SSMB29' గురించి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇప్పటివరకు ఎవరూ ఊహించనిరీతిలో రాజమౌళి గారు ఈ కథను రూపొందిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. ఆయన ఎంచుకునే కథలన్నీ భారీ స్కేల్‌తో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. విజువల్‌గా ఇది ఒక ట్రీట్ అవుతుంది' అని అన్నాడు.
ప్రస్తుతం SSMB29 టీమ్ హాలీడే మోడ్ లో ఉంది. మహేష్ బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక టూర్‌లో ఉన్నాడు. హీరోయిన్ ప్రియాంక చోప్రా బహమాస్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్‌ను ఆగస్టులో ప్రారంభించనున్నారు. అయితే, జులైలో కెన్యాలో ప్లాన్ చేసిన కీలక షెడ్యూల్‌ను అక్కడి పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో SSMB29 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆర్.ఆర్.ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు రావడంతో ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజులో తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి.