షూటింగ్ లో గాయపడ్డ ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా షూటింగ్ లో గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగింది.;

By :  S D R
Update: 2025-09-19 12:01 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా షూటింగ్ లో గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగింది. అయితే.. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యం కోసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఎన్టీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నందున, అభిమానులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.

ఇటీవలే ‘వార్ 2‘తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు.

Tags:    

Similar News