హారర్ మూవీలో రామ్?
మన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి రీచ్ అవుతుంది. అందుకే.. ఇప్పటివరకూ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్స్ లోనే అదరగొట్టిన మన స్టార్స్ నయా జానర్స్ వైపు చూస్తున్నారు.;
మన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి రీచ్ అవుతుంది. అందుకే.. ఇప్పటివరకూ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్స్ లోనే అదరగొట్టిన మన స్టార్స్ నయా జానర్స్ వైపు చూస్తున్నారు. ఇటీవల యాక్షన్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి‘ అంటూ హారర్ థ్రిల్లర్ తో అలరించాడు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఓ హారర్ సినిమాలో నటించబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలుకా’లో నటిస్తున్నాడు రామ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ‘బాహుబలి‘ నిర్మాతలు ఆర్కా మీడియాతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట.
ఈ చిత్రంతో కిషోర్ గోపూ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ హారర్ జానర్ లో ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.