‘ఓజీ‘ ట్రైలర్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ‘ఓజీ‘ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది.;

By :  S D R
Update: 2025-09-18 10:32 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ‘ఓజీ‘ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్సెస్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే.. సినిమా కథపై ఈ విజువల్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తోందా? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

లేటెస్ట్ గా ‘ఓజీ‘ ట్రైలర్ పై క్లారిటీ ఇచ్చేసింది టీమ్. ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 21 ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ ను పవర్ స్టార్ స్టైలిష్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’కి యూ/ఏ సర్టిఫికేట్ లభించినట్టు తెలుస్తోంది.

సెన్సార్ బోర్డు నుంచి బయటకు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ పార్ట్స్, ఎమోషనల్ డ్రామా బాగా ఆకట్టుకుంటాయట. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయి. ఈ రెండు, మూడు రోజుల్లోనే ‘ఓజీ‘ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.



Tags:    

Similar News