'ఓజీ' టికెట్ రేట్లు పెంపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. దసరా సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సెప్టెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.;

By :  S D R
Update: 2025-09-17 14:40 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. దసరా సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సెప్టెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ గా 'ఓజీ' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇస్తూ మెమో జారీ చేసింది.

సినిమా రిలీజ్ డే అయిన 25వ తేదీ ఉదయం 1 గంటకు ప్రత్యేక బెనిఫిట్ షో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను రూ.1000/- (GST సహా)గా నిర్ణయించింది. అయితే, ఒకరోజు ఐదు షోలకు మించకూడదని షరతు విధించింది.

ఇక సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక రేట్లు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు – ఒక్కో టికెట్ ధర రూ.125/- (GST సహా), మల్టీప్లెక్స్‌లు – ఒక్కో టికెట్ ధర రూ.150/- (GST సహా) పెంచుతూ అనుమతులు ఇచ్చింది ఎ.పి. గవర్న్‌మెంట్.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనెల 20న ట్రైలర్, 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్.

Tags:    

Similar News