ఎన్టీఆర్ ఎనర్జీకి 25 ఏళ్లు!
కొన్ని పేర్లకు ఓ ప్రత్యేక వైబ్రేషన్ ఉంటుంది. అటువంటి పేరు నందమూరి తారకరామారావు. ఆ పేరు ప్రభావాన్ని మోసుకుంటూ, ఆయన మనవడిగా తెలుగు సినిమాలోకి అడుగుపెట్టాడు తారక్.;
కొన్ని పేర్లకు ఓ ప్రత్యేక వైబ్రేషన్ ఉంటుంది. అటువంటి పేరు నందమూరి తారకరామారావు. ఆ పేరు ప్రభావాన్ని మోసుకుంటూ, ఆయన మనవడిగా తెలుగు సినిమాలోకి అడుగుపెట్టాడు తారక్. జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచినా, నటనలో మాత్రం అసలైన ఎన్టీఆర్ వారసుడిగా నిలిచాడు. బాల్యంలోనే వెండితెరపై రాముడిగా కనిపించి, త్వరలోనే ‘స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రిగా‘ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ‘ఆర్.ఆర్.ఆర్‘ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
జూనియర్ చిన్నప్పుడే తాత తారక రాముడితో కలిసి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర‘లో నటించాడు. అయితే గుణశేఖర్ తీసిన ‘రామాయణం‘లో బాల రాముడిగా ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. బాల నటుడిగా చేసిన ‘రామాయణం‘ పక్కన పెడితే.. కథానాయకుడిగా ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని‘.
రామోజీరావు నిర్మాణంలో వి.ఆర్.ప్రతాప్ తెరకెక్కించిన ‘నిన్ను చూడాలని‘ సినిమా మే 23, 2021న రిలీజైంది. అంటే.. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్లు పూర్తయ్యిందన్నమాట. ఇప్పుడు కథానాయకుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టాడు తారక్. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 25 సంవత్సరాల విశేషాన్ని పురస్కరించుకుని నిర్మాత నాగవంశీ కూడా తారక్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్-నీల్ టీమ్ కూడా విషెస్ తెలిపింది.