‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో నాని ఎంట్రీ!

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చేశాడు. ఇటీవల ‘హిట్ 3’తో సూపర్ హిట్ అందుకున్న నాని, ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’తో బిజీ అయ్యాడు.;

By :  S D R
Update: 2025-06-28 16:09 GMT

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చేశాడు. ఇటీవల ‘హిట్ 3’తో సూపర్ హిట్ అందుకున్న నాని, ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’తో బిజీ అయ్యాడు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకుంది. మొదటగా నాని చిన్నప్పటి పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. నాని ఈరోజు అధికారికంగా సెట్స్‌లోకి అడుగు పెట్టాడు.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ షూటింగ్ జరుగుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘దసరా’ తర్వాత మరోసారి నాని-శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ దక్కింది.

1980ల హైదరాబాద్‌ను నేపథ్యంగా తీసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తెలుగు సహా ఎనిమిది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ రిలీజ్ డేట్ చుట్టూ మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 'ది ప్యారడైజ్' వచ్చిన ఒక రోజుకి.. అంటే మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా 'పెద్ది' రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య భారీ క్లాష్ కన్ఫమ్ అయినట్టే.



Tags:    

Similar News