నెగటివ్ రోల్ లో నాని

నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ సినిమాతో నానిని మాస్ ఆడియెన్స్‌కి దగ్గర చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో ప్రాజెక్ట్‌కీ నానినే హీరోగా ఎంచుకోవడం విశేషం.;

By :  S D R
Update: 2025-08-19 01:13 GMT

నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ సినిమాతో నానిని మాస్ ఆడియెన్స్‌కి దగ్గర చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో ప్రాజెక్ట్‌కీ నానినే హీరోగా ఎంచుకోవడం విశేషం.

ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అలాగే ఆ తర్వాత ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికీ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాని మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడట. అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉండబోతుందన్న టాక్ ఫ్యాన్స్‌లో మరింత ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటివరకు పక్కింటి అబ్బాయి, రియలిస్టిక్ రోల్స్, మాస్ లుక్‌లో ఆకట్టుకున్న నాని, ఈసారి గ్రే షేడ్స్‌తో ఎలా ఇంప్రెస్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేలా డిజైన్ అవుతోందని సమాచారం. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో విలక్షణ నటులు మోహన్ బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యుయల్ విలన్ గా అలరించబోతున్నాడు. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 26న 'ది ప్యారడైజ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News